TG: BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు CM రేవంత్ రెడ్డి చెప్పారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్స్ చేయాలని డిమాండ్ చేశారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బీఆర్ఎస్ సభ్యులు సభను అడ్డుకునే శైలి ఉంటే.. తదుపరి సమావేశాల వరకూ సస్పెండ్ చేయాలని రేవంత్ కోరారు.