TG: షోరూంల్లో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జఠిలంగా మారుతోంది. కొత్త వాహనం కొన్న వారికి సాంకేతిక ఇబ్బందులు అడ్డుపడుతున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన వాహనాలకు సంబంధించిన RCలు అందడంలోనూ జాప్యం అవుతోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరి పేర్లపై రెండు వాహనాలు ఉన్నప్పటికీ ఆ డేటా షోరూంల సర్వర్లో కనిపించడం లేదని చెబుతున్నారు.