TG: డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. డీలిమిటేషన్ను 50శాతం జనాభా, 50శాతం GSDP పరంగా చేయాలన్నారు. అందుకే మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వేరువేరుగా పెట్టాలన్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే 18 రాష్ట్రాలు ఒకసారి, మిగిలిన రాష్ట్రాలు మరోసారి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందన్నారు.