AP: అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత లభించాక కూడా YCP చీఫ్ జగన్ ‘మావిగన్’ అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇలాగే మాట్లాడితే తర్వాతి ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని విమర్శించారు. 3 రాజధానులు అన్నందుకే ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఇప్పటికీ జగన్ తీరు మారట్లేదని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.