TG: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలతో వరుణుడు దోబూచులాడుతున్నాడు. రేపు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం, MBNR, నల్గొండ, HYDతోపాటు మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.