TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరగనుంది. కొన్నిరోజులుగా అక్కడక్కడా కురిసిన వర్షానికి వాతావరణం కొంత ప్రశాంతంగా ఉన్నా.. ఏప్రిల్ 10 నుంచి ‘అసలైన వేసవి’ ప్రారంభం కాబోతోందని వాతావరణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, KNR, WGL, KMM జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.