AP: తిరుమల శ్రీవారిని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రావడంతో స్వామివారికి కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, రాజ్యసభ, లోక్సభ సభాపతులకు శ్రీవారి ప్రసాదం తీసుకెళ్తానని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి సహకరించిన అన్ని పార్టీలకు రేపు శ్రీవారి ప్రసాదం అందజేస్తానని తెలిపారు.