AP: అమరావతి మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బంది అవుతోందనే ఉద్దేశంతో R-5 జోన్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ జోన్‌లోని 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించనున్నారు. గతప్రభుత్వం అక్కడ వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని CRDA రద్దు చేసింది. అయితే, అక్కడ స్థలాలు పొందిన లబ్ధిదారులకు ఇతర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిర్ణయించింది.