AP: YCP నేత మల్లాది విష్ణు NTR జిల్లా కలెక్టర్కు 12 అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ‘జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. చనిపోయినవారికి కూడా పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలేదు. అమరావతిలో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు వాటిని రద్దు చేశారు’ అని ఆయన విమర్శించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.