TG: రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో 90 LMT ధాన్యం ఉత్పత్తి అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి వివరించారు. ఇందులో 30 LMT బాయిల్డ్ రైస్, 5 LMT రా రైస్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. దీంతో ధాన్యం సేకరణ ప్రక్రియకు మార్గం సుగమమైంది.