Suresh Gopi : నరేంద్ర మోడీ జూన్ 9న మూడవసారి ప్రమాణ స్వీకారం చేసి ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. ఆయనతో పాటు 71 మంది ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో కేరళలో తొలిసారిగా బీజేపీని విజయపథంలో నడిపించిన కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తనకు సినిమాలు చేయాలని ఉందని, తనకు మంత్రి పదవి వద్దు అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఆయన ఖండించారు. నేను అలా అనలేదని చెప్పాడు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన సురేష్ గోపి.. నాకు ఎంపీగా పని చేయాలని ఉందని, రాష్ట్ర మంత్రిని కావాలనే కోరిక లేదని అన్నారు. రాష్ట్ర మంత్రి పదవి వద్దు అని పార్టీకి ముందే చెప్పాను. త్వరలో పార్టీ నన్ను ఆ పదవి నుంచి తొలగిస్తుందని భావిస్తున్నాను అని సురేష్ గోపి అన్నారు. ప్రస్తుతం నేను చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని చెప్పారు.
చరిత్ర సృష్టించిన కేరళ
త్రిసూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నటుడిగా మారిన రాజకీయ నాయకుడు సురేష్ గుప్తా చరిత్ర సృష్టించి, కేరళ నుంచి బీజేపీకి చెందిన తొలి లోక్‌సభ ఎంపీగా నిలిచారు. ఎన్నికల సమయంలో కేరళకు మోడీ గ్యారంటీ వాగ్ధానానికి ముగ్ధుడైన గోపీ. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పార్టీ తనను ఈ పదవి నుంచి తొలగిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi Government. This is grossly incorrect. Under the leadership of PM @narendramodi Ji we are committed to the development and prosperity of Kerala ❤️ pic.twitter.com/HTmyCYY50H
కాంగ్రెస్ దాడి
సురేశ్ గోపీ ఈ వైఖరితో బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. నటుడు, ఎంపీ సురేష్ గోపి ఆదివారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, ఇంకా శాఖలు కేటాయించలేదని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ రోజు అతను సినిమాలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఈ పదవిని వదిలేయాలనుకుంటున్నాడు! బీజేపీ పై కాంగ్రెస్ దాడి చేసి ఓటర్లను ఎందుకు ఇలా అపహాస్యం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోమని మీ ఎంపీకి ఎందుకు చెప్పరు, మరీ ముఖ్యంగా దేవుడు, రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేసిన తర్వాత మీడియా ముందు ఇలా మాట్లాడడం సరికాదన్నారు.
74 వేల ఓట్ల మెజార్టీ
కేరళలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సురేష్ గోపి, కేరళలోని త్రిసూర్‌లో తొలిసారిగా బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించారు. మలయాళ నటుడు సురేష్ గోపి 412338 ఓట్లు సాధించి సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై 74686 వేల ఓట్లతో విజయం సాధించారు. సురేష్ గోపీ 2016లో బీజేపీలో చేరారు. రెండేళ్ల తర్వాత లోక్‌సభ స్థానానికి టిక్కెట్ లభించి 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం సురేష్ గోపీ నాలుగు సినిమాలు చేయబోతున్నాడు. అందుకే అనుకున్న సమయానికి షూటింగ్ చేయలేకపోతే ఆ సినిమాలు పూర్తి కావు అని అంటున్నారు.