కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు చోరీ (Chori) కావడం కలకలం రేపింది. రాత్రిపూట బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన బస్సు తెల్లారేసరికి మాయమైంది. దీంతో ఆర్టీసీ (RTC) అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
సైకిళ్లు, బైకులు, కార్లు చోరికి గురి అవుతుండడం గురించి మనం తరుచూ వింటూంటాం అయితే, కర్ణాటక( Karnataka) రాష్ట్రంలో దొంగలు ఏకంగా ఓ బస్సును (BUS)చోరీ చేశారు. ప్రయాణికులు తమ తమ సామాన్లను జాగ్రత్తగా చూసుకోండి.. జేబు దొంగలు ఉంటారు జాగ్రత్త.. అంటూ బస్టాండ్లలో మైకులో ప్రకటనలు వినిపిస్తుంటాయి. గోడలపైన రాతలు, బోర్డులు కూడా కనిపిస్తుంటాయి. కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు చోరీ (Chori) కావడం కలకలం రేపింది. రాత్రిపూట బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన బస్సు తెల్లారేసరికి మాయమైంది. దీంతో ఆర్టీసీ (RTC) అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటివరకు బస్సును స్వాధీనం చేసుకోలేకపోయారు. ఏదైనా నిర్మానుష్య ప్రాంతంలో దొంగలు ఆ బస్సును వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చోరీకి గురైన బస్సు ఎక్కడుందో తెలుసుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
దీంతో ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించగా తెలంగాణలో(Telangana) బస్సు దొరికింది. అయితే, బస్సును ఎవరు దొంగిలించారు, తెలంగాణ దాకా ఎలా తీసుకొచ్చారనే విషయం ఇంకా తెలియరాలేదు. కలబురిగి (Kalaburigi)జిల్లా చించోలి బస్టాండ్ లో ఈ దొంగతనం జరిగింది. బీదర్-2 డిపోకు చెందిన KA-38 F-971 బస్సు చించోలి-బీదర్ మధ్య రాకపోకలు సాగిస్తుంది. సోమవారం రాత్రి బీదర్ (Bidar) నుంచి ప్రయాణికులతో చించోలికి వచ్చింది. అదే లాస్ట్ ట్రిప్ కావడంతో డ్రైవర్ ఆ బస్సును బస్టాండ్లో పార్క్ చేశారు. ఉదయం బీదర్ తీసుకెళ్లేందుకు వచ్చిన డ్రైవర్ కు బస్సు (BUS) కనిపించలేదు.