బాయ్‌కాట్.. ఈ ఒక్క మాట ఇప్పుడు బాలీవుడ్‌ను వణికిస్తోంది. ఏళ్లకేళ్లు బాలీవుడ్‌ను ఏలిన బడా స్టార్స్ సైతం బాయ్ కాట్ బ్యాచ్‌కు బేంబేలెత్తిపోతున్నారు. ఈ మధ్య వచ్చిన హిందీ సినిమాల్లో కంటెంట్ లేకపోవడం ఒకటైతే.. దానికి తోడు బాయ్ కాట్ బ్యాచ్ చేసే ప్రచారంతో.. వీకెండ్ వరకు కూడా థియేటర్లో నిలబడలేకపోతున్నాయి. ఇటీవల వచ్చిన అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీనంతటికి కారణం నెపోటిజం అనే చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో.. బాయ్ కాట్ ట్రెండ్‌తో.. భారీ ఆశలు పెట్టుకొని.. భారీ అంచనాలతో.. ప్రేక్షకుల ముందుకొచ్చింది బ్రహ్మాస్త్ర. సౌత్‌లో ఈ సినిమా రాజమౌళి సమర్పణలో రిలీజ్ అవడంతో.. అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
అయితే ఈ సినిమా పై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జోరుగా జరిగాయి. బుకింగ్స్ ద్వారానే 10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. దాంతో హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ 25 నుంచి 30 కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు. అంతేకాదు ఈ మధ్య వచ్చిన హిందీ సినిమాలను బ్రేక్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. అయితే అంత మొత్తంలో రాబట్టాలంటే.. ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆడియెన్స్‌ను మూడు గంటల పాటు థియేటర్లో కూర్చపెట్టగలిగితేనే సాధ్యమంటున్నారు. ఎందుకంటే.. బ్రహ్మాస్త్ర 2 గంటలు 47 నిమిషాల రన్‌తో టైంతో రిలీజ్ అయింది. అయితే ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా.. బ్రహ్మాస్త్రను కాపాడడం ఎవరి వల్ల కాదనే చెప్పొచ్చు. బాయ్ కాట్ బ్యాచ్ మరింతగా రెచ్చిపోవడమే కాదు.. భారీ నష్టాలు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ‘బ్రహ్మాస్త్ర’ వీటన్నింటిని బద్దలు కొడుతుందేమో చూడాలి.