ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. నవంబర్ 1న ఇటలీలో వీరి పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కానీ పవర్ స్టార్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. మరి అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు?
చాలా రోజులు ప్రేమించుకున్నారు. ఫైనల్‌గా ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వరుణ్ తేజ్(varun tej), లావణ్య త్రిపాఠి(lavanya tripathi). ఇటలీలోని టుస్కానీలో వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీ అంతా ఇటలీలోనే ఉన్నారు. నవంబర్ 1న లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్. అయితే..ఈ పెళ్ళిలో మెగా, అల్లు కుటుంబం మొత్తం సదండి చేసింది. కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) ఎక్కడ కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. వరుణ్ పెళ్లి కోసం మూడు రోజుల ముందే తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఇటలీ ఫ్లైట్ ఎక్కేశాడు పవర్ స్టార్. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
కానీ ఆ తర్వాత మళ్లీ కెమెరా కంట పడలేదు పవన్. కాక్ టైల్ పార్టీ, హల్దీ, మెహందీ, సంగీత్.. లాంటి వేడుకలోను కనిపించలేదు. దీంతో మెగాభిమానులు పవన్ ఎక్కడ.. అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అసలు పవన్.. వరుణ్ తేజ్ పెళ్లికే వెళ్లాడా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. కానీ పవన్ పెళ్లికి వెళ్లింది నిజం. కానీ ఎందుకో కెమెరాకు మాత్రం చిక్కలేదు పవన్. ఒకవేళ పవన్ ఫోటోలు బయటికి వచ్చే ఉంటే..ఈపాటికే సోషల్ మీడియా షేక్ అయిపోయి ఉండేది. కానీ కావాలనే పవన్ తన ఫోటోలు బయటికి రాకుండా చేశాడా? లేదంటే.. పెళ్లి చూసుకుని వెంటనే అక్కడి నుంచి బయల్దేరిపోయడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ వరుణ్ తేజ్(varun tej) ఆల్బమ్‌తో మాత్రం ఖచ్చితంగా పవన్ ఫోటోలు బయటికి రానున్నాయి. ఇకపోతే..ప్రస్తుతం పవన్.. హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.