»Mega Family On Vacation Lavanya Tripathi Following Niharika
Mega family: వెకేషన్లో మెగా ఫ్యామిలీ.. నిహారికను ఫాలో అవుతున్న లావణ్య త్రిపాఠి!
నిజమే.. మరో రెండు రోజుల్లో మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాటి.. ఓ విషయంలో మెగా డాటర్ నిహారికను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెకేషన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఒక్కొక్కరుగా ఇటలీకి చేరుకున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా ఇటలీకి చెక్కేశారు. ఇంకొన్ని గంటల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలెక్కబోతున్నారు. నవంబర్ 2న ఇటలీలో వీరి పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగనుంది. 31న హల్దీ, మెహందీ వేడుకలతో పెళ్లిసందడి మొదలు కానుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి చేరుకున్నారు. ముందుగా.. రామ్ చరణ్ తన భార్య ఉపాసన, పాప క్లింకారతో ఇటలీకి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత నిహారిక కూడా ఫ్లైట్ ఎక్కేసింది. అలాగే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కూడా సతీసమేతంగా ఇటలీకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పెళ్లితో పాటు ఇటలీ వెకేషన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుడడంతో.. తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ పెళ్లి కోసం లావణ్య త్రిపాటి మెగా డాటర్ నిహారికకు ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. నిహారిక పెళ్లిలో తన తల్లి పెళ్లి పట్టుచీరను కట్టుకుంది.
ఇప్పుడు లావణ్య త్రిపాటి కూడా తన తల్లి పెళ్లి రోజున కట్టుకున్న చీరను మోడ్రన్‌గా డిజైన్ చేయించి.. పెళ్లి పీటల మీద కూర్చోనుందని తెలుస్తోంది. ఆ చీరను కేప్ లెహంగాలో డిజైన్ చేశారట. ఇప్పుడితే కొత్త ట్రెండ్‌గా అంటున్నారు. అయితే.. నిహారిక-చైతన్య పెళ్లి జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కానీ ఊహించని విధంగా మూడేళ్లలోనే ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అలా అని.. లావణ్య త్రిపాటి, వరుణ్ తేజ్ గురించి ఎలాంటి డౌట్స్ లేవు లేండి.