సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో.. ఫస్ట్ టైం ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ‘గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్’గా ఈ ప్రాజెక్ట్ రానుంది. దాంతో భారీ స్టార్ క్యాస్టింగ్‌ను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. అందులోభాగంగా ఓ స్టార్ హీరోని విలన్‌గా తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక హీరోయిన్ విషయంలోను అదే విదంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు వినిపించినట్టుగానే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’లో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. దాంతో మహేష్ సినిమాలోను ఈ అమ్మడినే తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీపికకు మంచి స్టార్ డమ్ ఉంది. బాలీవుడ్లో సెట్స్ పై ఉన్న పలు భారీ సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఒకటి అర హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. దీంతో ఇంటర్నేషన్ రేంజ్లో దీపికకు క్రేజ్ ఉంది. అందుకే ఈ బోల్డ్ బ్యూటీనే ఫైనల్ చేయనున్నారని టాక్. అయితే ఇప్పుడే మహేష్ సరసన హీరోయిన్ను ఫిక్స్ చేయలేం. ఎందుకంటే రాజమౌళి కథకు సరిపోతేనే ఆమెను తీసుకుంటాడు.. లేదంటే లేదు. కాబట్టి స్టార్ డమ్‌ను బట్టి రాజమౌళి సినిమాలో ఛాన్స్ కష్టం. ఇకపోతే బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్ స్థాయిలో మెప్పించిన జక్కన్న.. మహేష్ కోసం భారీ ప్లానింగ్ చేస్తున్నాడు. పైగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బజ్ వైరల్ అవుతోంది. కాబట్టి SSMB 29 నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెప్పొచ్చు.