TG: మహిళల స్వావలంభనకు కృషి చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. మహిళల నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మహిళల పేరు మీదుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. 2014-18 నుంచి బీఆర్ఎస్ హయాంలో ఒక్క మహిళా మంత్రి లేరని ఆరోపించారు. మహిళలను రాష్ట్రపతిగా, స్పీకర్లు, గవర్నర్లు, సీఎంలుగా చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.