అభిషేక్, హెడ్, క్లాసెన్ వంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నప్పటికీ SRHలో లోపాలు కనిపిస్తున్నాయని మాజీ ప్లేయర్ పుజారా అభిప్రాయపడ్డాడు. వారు ఔటయ్యాక ముందుకు తీసుకెళ్లే ప్లేయర్లు లేరని, దీన్నే ప్రత్యర్థి జట్లు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నాయని పేర్కొన్నాడు. ఈ కారణంగానే SRH హైదరాబాద్ మినహా బయటి మ్యాచుల్లో పెద్దగా స్కోర్ చేయలేకపోతోందని, దీనిపై ఆ టీమ్ దృష్టి సారించాలని సూచించాడు.