TG: సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు ను మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు మాసీపై కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్‌ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు. పూర్తి డీపీఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని ఆరోపించారు.