మాస్ మహారాజా ‘ధమాకా’ చూపించేందుకు ఏ మాత్రం లేట్ చేయడం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న రవితేజ.. తన కొత్త చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకాలో.. పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్‌గానే షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. గుమ్మడి కాయ కొట్టేసిన సందర్భంగా టపాసులు పేల్చి సెలబ్రేషన్స్ చేకుంది చిత్ర యూనిట్. ప్రస్తుతం ధమాకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దాంతో ఇప్పుడు రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు సమాచారం. దీపావళి కానుకగా అక్టోబరు 21 విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మాసివ్ ట్రాక్స్ అంచనాలను పెంచేశాయి. దాంతో ఈ సారి దీపావళి ధమాకా మాస్ మహారాజాదేనని అంటున్నారు అభిమానులు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో పాటు.. మెగాస్టార్ నటిస్తున్న 154 ప్రాజెక్ట్‌లోను కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాల షూటింగ్ ఎండింగ్ స్టేజ్‌లో ఉండడంతో.. త్వరలోనే కొత్త సినిమాలను మొదలు పెట్టబోతున్నాడు రవితేజ. మరి ధమాకా ఎలా ఉంటుందో చూడాలి.