తన సింగిల్ స్టేటస్‌పై ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు చిన్నప్పటి నుంచి ఏకాంతం అలవాటని, ఒంటరిగా గడపడం ప్రశాంతతను ఇస్తుందని తెలిపాడు. ‘ఎవరైనా నా జీవితంలోకి వస్తే వారితో గడపడానికి సిద్ధమే, లేకపోయినా ఒంటరిగా మరింత సంతోషంగా ఉంటాను. ఇది నా వ్యక్తిత్వం మాత్రమే, కావాలని తీసుకున్న నిర్ణయం కాదు’ అని స్పష్టం చేశాడు.