హాలీవుడ్ విజువల్ వండర్ ‘డ్యూన్ 3’ మేనియా ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఉంది. 2026 డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమా ‘ఐమ్యాక్స్ 70mm’ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ మూవీ క్రేజ్ ఎంతలా ఉందంటే, రీసేల్ మార్కెట్లో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.90,000 వరకు పలుకుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఇంత భారీ మొత్తం వెచ్చించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.