త్వరలో ‘కర’ సినిమాతో తెరపైకి రావడానికి హీరో ధనుష్ సన్నద్ధమవుతున్నాడు. ‘డీ 56’ (వర్కింగ్ టైటిల్)గా పట్టాలెక్కబోతున్న ఈ చిత్రంలో ధనుష్‌తో రుక్మిణీ వసంత్ జోడీ కట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడామె స్థానంలో బాలీవుడ్ యువ నటి సారా అర్జున్ను తీసుకున్నట్లు సమాచారం. ‘ధురంధర్’తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సారా ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.