రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న మూవీ ‘రామాయణ’. శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ గ్లింప్స్ ‘రామ’పై అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల సమక్షంలో ఒక భారీ ఈవెంట్‌తో ఈ మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయనున్నట్లు చెప్పారు.