నితేష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ మూవీ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోంది. AR రెహమాన్, హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మర్ కలిసి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. జిమ్మర్ రాకతో ఈ ప్రాజెక్టుకు గ్లోబల్ క్రేజ్ వచ్చిందని, విదేశీయులు కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతారని రెహమాన్ ధీమా వ్యక్తం చేశారు. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు.