VSP: సింహాచల శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈవో వెంకటరావు తెలిపారు. దర్శనం, ప్రసాదాలు, ఆర్జిత సేవల టికెట్లను భక్తులు అధికారిక వెబ్సైట్, ‘మనమిత్ర’ యాప్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా సులభంగా పొందవచ్చన్నారు.