మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. రెంటల్(అద్దె) విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న నష్టాలను వారు చిరుకు వివరించనున్నారు. భవిష్యత్తులో పెద్ద సినిమాలను కేవలం పర్సంటేజ్(వాటా) పద్ధతిలోనే థియేటర్లలో విడుదల చేసే అంశంపై మద్దతు ఇవ్వాలని వారు మెగాస్టార్‌ను కోరనున్నారు.