PDPL: ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో రూ.14.38 కోట్లతో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము నిర్మాణానికి ప్రభుత్వ విప్, చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి భూమిపూజ నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే అధిక వరి ఉత్పత్తి జరిగే ప్రాంతమని ఆయన తెలిపారు.