SRD: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో ఆటోలు అడ్డదిడ్డంగా పార్క్ చేయడం వల్ల 108 అంబులెన్స్‌ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల గర్భిణులు, నవజాతి శిశువులను అత్యవసర సమయాల్లో పెద్ద ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి ఆసుపత్రి ప్రాంగణంలో ట్రాఫిక్‌ను నియంత్రించాలని రోగుల కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు.