RR: చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామం PACS సొసైటీ కార్యాలయంలో రైతులకు జనుము విత్తనాలను ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. రాష్ట్రంలోనే మొదటగా జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేవెళ్ల నియోజకవర్గంలో ప్రారంభించినట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. పీఎసీఎస్ ఛైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.