ATP: తాడిపత్రి పట్టణంలో ఇవాళ తెలంగాణ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క పర్యటించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి బర్రెలక్కకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.