KNR: శంకరపట్నం మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఐకేపీ వీవోఏ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డీటీ ఖాదర్‌కు వినతిపత్రం అందజేశారు. వీవోఏలకు కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. హెచ్ఆర్ పాలసీ అమలు, అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న వెలుగు కార్యాలయం ఎదుట నిరసన దీక్షా శిబిరం నిర్వహిస్తామన్నారు.