TG: హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాల సంచాలకులు పరస్పరం బదిలీ అయ్యారు. హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న అమరావతికి బదిలీ కాగా, అమరావతి వాతావరణ శాఖ సంచాలకులు స్టెల్లా హైదరాబాద్కు బదిలీ అయ్యారు. వీరితో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజును ఢిల్లీకి బదిలీ చేశారు. వాతావరణ విభాగంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.