అనకాపల్లికి చెందిన రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్రను భీమిలి నియోజకవర్గం టీడీపీ అబ్జర్వర్‌గా పార్టీ నియమించింది. ఈ మేరకు సోమవారం భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో సురేంద్ర భేటీ అయ్యారు. ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహించే మహానాడుపై చర్చించారు. పార్టీ శ్రేణులు మహానాడు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సురేంద్ర విజ్ఞప్తి చేశారు.