ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ 2026 అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ‘తండేల్’ మూవీకి నాగచైతన్య ఉత్తమ నటుడిగా, ‘ది గర్ల్‌ఫ్రెండ్’కు రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ దర్శకుడిగా, అదే మూవీకి మాస్టర్ రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా నిలిచారు. ‘మిరాయ్’ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఏప్రిల్ 16న ముంబైలో ఈ వేడుక జరగనుంది.