ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది.
పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కలిసి మరోసారి రచ్చ చేయడానికి వచ్చేస్తున్నారు.ఈ క్రేజి కాంబో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాసివ్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత రామ్ చేసిన మాస్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో నటించిన ‘స్కంద’ సినిమా సెప్టెంబర్ 28 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు రామ్. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు.
లైగర్ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు పూరి. ఈ సినిమాతో ఇక పూరి పనైపోయిందనే టాక్ సొంతం చేసుకున్నాడు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో బౌన్స్ అవడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్‌తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. పూరి స్టైల్లోనే అనౌన్స్మెంట్ రోజే రిలీజ్ డేట్ లాక్ చేసి.. జెట్ స్పీడ్‌లో షూట్ చేస్తున్నాడు. ఇటీవలె బ్యాంకాక్‌లో పవర్ ఫుల్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన పూరి.. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ చేస్తున్నాడు. స్టార్ క్యాస్టింగ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. 2024 మార్చి 8 టార్గెట్‌గా ఈ సినిమా షూటింగ్ దూసుకుపోతోంది. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ సంస్థ పై పూరి జగన్నాథ్‌తో కలిసి ఛార్మి నిర్మిస్తున్నారు. మరి డబుల్ ఇస్మార్ట్‌తో పూరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.