పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. ఆ తర్వాత కూడా కలెక్షన్లు బాగున్నాయి. దాంతో ఈ సినిమా బాలీవుడ్‌కు కొత్త ఊపిరిపోసిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు బ్రహ్మాస్త్రకు కష్టమేనంటున్నారు. ఈ సినిమాను దాదాపు 410 కోట్ల బడ్జెట్‌తో.. విజువల్ వండర్‌గా రూపొందించారు. కాబట్టి ఈ బ్రహ్మాస్త్రకు లాభాలు రావాలంటే అంతకు మించి వసూళ్లను రాబాట్టాల్సి ఉంది. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం కష్టమనే అంటున్నాయి. కరణ్ జోహార్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న బాయ్ కాట్ బ్యాచ్‌ను తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర నిలబడింది ‘బ్రహ్మాస్త్ర’. పైగా సౌత్‌లో రాజమౌళిని ముందు పెట్టి ప్రమోట్ చేశాడు. కాబట్టి అంచనాలకు తగ్గట్టే రిజల్ట్ అందుకుంది.
డే వన్ ఓపెనింగ్స్ 75 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ఫస్ట్ వీకెండ్లో బాగానే సత్తా చాటింది. దాంతో నెక్ట్స్ వీక్‌లో బ్రహ్మాస్త్ర బ్రేక్ ఈవెన్ ఖాయమనుకున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 270 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు టాక్. పైగా బ్రహ్మాస్త్ర కలెక్షన్లు రోజు రోజుకి భారీగానే డ్రాప్ అవుతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ పాన్ ఇండియా మూవీకి నష్టాలు తప్పేలా లేవంటున్నారు. అయితే తెలుగులో మాత్రం బ్రహ్మాస్త్రకు ఢోకా లేదంటున్నారు. ఇక రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా పై.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఫైర్ అవుతునే ఉంది. బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ లెక్కలన్నీ ఫేక్ అని ప్రచారం చేస్తోంది. ఎటు చూసిన మొత్తంగా బ్రహ్మాస్త్రకు కష్టమేనంటున్నారు.