»Actress Adah Sharmas Contact Details Get Leaked On Social Media
Leakes హీరోయిన్ ఆదా శర్మ ఫోన్ నంబర్లు లీక్.. హెచ్చరికలు
ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి నటి ఆదా శర్మపై ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఇదే ఆగ్రహంతో ఓ వ్యక్తి ఆదా శర్మ వ్యక్తిగత వివరాలు బహిరంగ పరిచాడు.
అభూత కల్పనను వాస్తవ కథగా (Fact) చిత్రీకరించి ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించేలా తీసిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమా సర్వత్రా విమర్శలు వస్తుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం వత్తాసు పలుకుతోంది. బలవంతంగా ప్రజలు ఈ సినిమా చూసేలా చేస్తోంది. వివాదాస్పదమైన ఈ చిత్రంపై కొన్ని రాష్ట్రాలు నిషేధం ప్రకటించాయి. అనేక వివాదాలకు (Riots) కేంద్రంగా మారిన ఈ సినిమాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్ర బృందంపై (Movie Team) తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి నటి ఆదా శర్మపై (Adah Sharma) ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఇదే ఆగ్రహంతో ఓ వ్యక్తి ఆదా శర్మ వ్యక్తిగత వివరాలు (Personal Details) బహిరంగ పరిచాడు. ఆదా శర్మ ఫోన్ నంబర్ ను ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో షేర్ చేశాడు. ఆమె కొత్త నంబర్ ను కూడా బయట పెడతానని హెచ్చరించాడు. అయితే ఆ వ్యక్తి తన ఇన్ స్టా ఖాతాను డీయాక్టివేట్ (Deactivate) చేశాడు. ఫోన్ నంబర్ బయటపెట్టడంతో ఆదా శర్మకు బెదిరింపులు వచ్చాయి.
సోషల్ మీడియా ద్వారా ఆమెకు బెదిరింపులు వచ్చాయి. ఫోన్ కాల్స్ (Phone Calls), సందేశాలు పెరగడంతో ఆదా శర్మ తన ఫోన్ నంబర్ (Phone Number)ను మార్చినట్లు తెలుస్తోంది. అతడు బయటపెట్టిన నంబర్ ను వినియోగించడం లేదని తెలిసింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో (Direction) కేరళ స్టోరీ తెరకెక్కిన విషయం తెలిసిందే.