ATP: రాప్తాడు నియోజకవర్గం కురుగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి పరిటాల సునీత ఆదేశాల మేరకు తెలుగు రైతు అధ్యక్షుడు కురుగుంట నారాయణస్వామి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కృషి చేసిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు.