తమిళంలో చిన్న సినిమాగా వచ్చి రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘తాయ్ కిళవి’ ఓటీటీ డేట్ ఖరారైంది. నటి రాధిక ప్రధాన పాత్రలో, హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ కామెడీ డ్రామా ఏప్రిల్ 10 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రోల్ కోసం రాధిక పడ్డ కష్టం, మేకప్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.