ఈ సమ్మర్ అంతా ‘బైకర్’దేనని దర్శకుడు అభిలాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు. రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అద్భుతమైన మౌత్ టాక్ లభిస్తోందని మూవీ సక్సెస్ మీట్లో తెలిపాడు. కేవలం యువతకే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాలోని భావోద్వేగాలు కనెక్ట్ అవుతున్నాయని పేర్కొన్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ లాంగ్ రన్ ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.