మెగా హీరో వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘బరి’ షూటింగ్ సందర్భంగా కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుణ్‌కు సర్జరీ జరిగినట్లు ఆయన సోదరి నిహారిక కొణిదెల వెల్లడించింది. ప్రస్తుతం వరుణ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపింది. త్వరలోనే కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటాడని పేర్కొంది.