ఖమ్మం వ్యవసాయ మార్కెట్ శనివారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 21,500, గా కొత్త మిర్చి ధర 21,700, గా ఉంది. అలాగే క్వింటా పత్తి ధర రూ. 8,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.300, పత్తి ధర రూ. 100 తగ్గగా, కొత్త మిర్చి ధర రూ. 250 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.