టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, బి. రామరాజు(85) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇవాళ ఉదయం మధురానగర్లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.