HYD: కొండాపూర్ సుమధుర అపార్ట్మెంట్లో కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మనుశ్రీ పని ఒత్తిడిని తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా కార్యాలయంలో పెరుగుతున్న పని భారం కారణంగా ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురైందని, అదే ఈ దారుణ నిర్ణయానికి పురిగొల్పిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.