గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ‘మహిళా జన్ సునాయ్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని మహిళల సమస్యలు తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కార్యక్రమం చేపడుతోంది. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజా పాల్గొననున్నారు.