హీరో కవిన్, నయనతార తొలిసారి జంటగా నటిస్తున్న మూవీ ‘హాయ్’. విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ.. ఫస్ట్ సింగిల్ ‘కన్నకుజియా’ అప్డేట్ను నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ మెలోడీ సాంగ్‌ను ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.