రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీలో మరో భారీ విల్లాను కొనుగోలు చేసినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అక్కడి వాతావరణంపై మక్కువతో ఖాళీ దొరికితే ఆయన ఇటలీకే వెళ్తుంటాడు. గతంలోనే ఒక విల్లా కొన్న ప్రభాస్, తాను లేని సమయంలో దానిని అద్దెకు ఇస్తాడని సమాచారం. ఇప్పుడు మరో విల్లా కొనడంతో భవిష్యత్లో ప్రభాస్ అక్కడే సెటిల్ అవుతాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.