TPT: APWJF ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ప్రథమ మహాసభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌లకు త్వరలోనే ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తామన్నారు. తిరుపతి రూరల్ ప్రెస్ క్లబ్ కోసం 25 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు, విలేకరులు పాల్గొన్నారు.