TG: సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టకు సీఎం రేవంత్ బయల్దేరారు. రైతు ఉత్సవాల కార్యక్రమానికి ఆయనతో పాటు మంత్రులు దామోదర, పొంగులేటి హాజరుకానున్నారు. టీజీ ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రిఫైనరీకి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.